కొనసాగిస్తున్నాం...

హాలీవుడ్‌లో అద్భుత శక్తులు ఉండే సూపర్‌హీరోలకి కొదవే లేదు. ఆ జాబితాలోకి లేటుగా వచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుని ‘డెడ్‌పూల్‌’తో హిట్‌ కొట్టాడు రేయాన్‌ రేనాల్డ్స్‌. ప్రపంచ వ్యాప్తంగా కామెడీ యాక్షన్‌తో అదరకొట్టి బాక్సాఫీస్‌ కలెకన్లు కొల్లకొట్టాయి ‘డెడ్‌పూల్‌’ చిత్రాలు. మరి విజయవంతమైన చిత్రాలకు హాలీవుడ్‌లో కొనసాంగిపు చాలా సహజమే. ఇప్పుడు ఈ సిరీస్‌లో ‘డెడ్‌పూల్‌3’ రాబోతుందని కథానాయకుడు రేయాన్‌ వెల్లడించాడు. దీనిపై మార్వెల్‌ స్టూడియోస్‌ పనిచేస్తున్నట్లు తెలిపాడు. ‘ ప్రస్తుతం మా బృందమంతా దీనిపై పనిచేస్తోంది. మార్వెల్‌ దాన్ని పూర్తి చేస్తుంది. ఇదొక క్రేజీ ప్రాబెక్టు’ అని రేయాన్‌ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశలున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.