తండ్రి కోసం కత్తి పట్టిన ‘ములన్‌’

వాల్ట్‌ డిస్నీ 1998లో యానిమేటెడ్‌ రూపంలో తెరకెక్కించిన చారిత్రిక సాహస చిత్రం ‘ములన్‌’. ఇప్పుడు అదే చిత్రానికి స్వీక్వెల్‌గా వివిధ నటీనటులతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ములన్‌’. నిక్కీ కారో దర్శకత్వంలో చారిత్రిక యుధ్ద నేపథ్యంలో వస్తున్న చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ నటి లియు-యిఫీ - హువా ములన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర కథేంటంటే ఉత్తర ఆక్రమణదారుల నుంచి తమ దేశాన్ని రక్షించడానికి ప్రతి గడపకొకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ఉత్తర్వులు జారిచేస్తాడు. దాంతో ఆ దేశ సైన్యాధ్యుక్షని కూతురు హువా ములన్‌ (లియు) ముందుకొస్తుంది. ఆ తరువాత ఆమె సైన్యంలో ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటుంది. ఆ తరువాత సైనికులతో కలిసి తమ దేశాన్ని శత్రవుల భారీ నుంచి ఎలా కాపాడిందన్నది మిగతా కథ. చక్రవర్తిగా నటుడు జెట్‌ లి, కమాండర్‌ టంగ్‌గా డొన్ని యెన్, యసోన్‌ అన్‌గా చెన్‌-హొంగొయ్, బేరి ఖాన్‌ పాత్రలో జాసన్‌ స్కాట్‌ లీలు నటిస్తున్నారు. గతంలో సినిమాకి సంబందించిన ట్రైలర్‌ విడుదలై ఈ సినిమాపై అంతర్జాతీయం అంచనాలు పెంచేసింది. హాలీవుడ్‌కి చెందిన వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్, జాసన్‌.టి.రీడ్‌ ప్రొడక్షన్స్, గుడ్‌ ఫియర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు. హ్యారీ గ్రెగన్స్‌-విలయమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.