దేశాన్ని రక్షించే ‘ములన్‌’

నికీకారో దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ములన్‌’. చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఉత్తర ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించడానికి ఇంటికొకరు చొప్పున సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ఉత్తర్వు జారిచేస్తాడు. దాంతో దేశంలోని ప్రతి ఒక్కరు తప్పకుండా సైన్యంలో చేరడానికి ముందుకొస్తారు. అంతకంటే ముందుగా సైన్యాధ్యుక్షుని కూతురు హువా ములన్‌ (లియు-యిఫీ) ముందుకొస్తుంది. ఆ సమయంలో హువా ములన్‌ కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటుంది. తరువాత దేశాన్ని ఎలా కాపాడిందనేది మిగతా కథ. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రంలో జెట్లీ చక్రవర్తిగా, కమాండర్‌ టంగ్‌గా డొన్ని యెన్, యాస్‌న్‌ ఆన్‌గా చెన్‌-హోంగొయ్, బేరి ఖాన్‌ పాత్రలో జాసన్‌ స్కాట్ లీ, జియాన్ని యాంగ్‌గా గాంగ్‌ లిలు నటిస్తున్నారు. ‘ది బల్లాద్‌ ఆఫ్‌ ములన్‌’ అనే కథ ఆధారంగా వస్తున్న సినిమాకి రిక్‌ జఫా, లారెన్‌ హైనెక్, అమందా సిల్వర్‌లు కథను సమకుర్చారు. వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ పంపిణిదారులుగా వ్యవరిస్తున్న చిత్రం మార్చి 27, 2020 విడుదల కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.