ఇతిహాసాల ‘డూన్’‌ ట్రైలర్‌ చూశారా!

ఆధునిక ఇతిహాసాల సైన్స్ ఫిక్షన్‌ నేథ్యాలను కథలుగా మలిచే మాస్టర్‌, డెనిస్‌ విల్లెనెయువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డూన్’‌. ఫ్రాంక్‌ హెర్బర్ట్ రాసిన డూన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తిమోతీ చాల్‌మెట్‌, రెబెకా ఫెర్గూసన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్, విల్లెనెయువ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. చిత్ర కథేంటంటే రాబోయో కాలంలో ఈ మానవ ప్రపంచంలో ప్రమాదకరమైన ఎడారి గ్రహం అరికాస్‌ అని అంగీకరిస్తారు. దీనిని డూన్‌ అని కూడా పిలుస్తారు. విశ్వంలోని అత్యంత విలువైన పదార్థం అక్కడ ఉంటుంది. మానవునికి అతీతంగా ఆలోచించే పదార్థం. మనిషి జీవితకాలాన్ని పెంచే పదార్థం, మన ఆలోచనలను స్థాయిని పెంచడంతో పాటు తేలికగా, ఎంతదూరమైన ప్రయాణాన్ని సాధ్యం చేసుకోవచ్చు. టూకీగా చిత్ర కథ ఇది. ఇందులో పాల్‌ అట్రైడెస్‌గా తిమోతీ చాలమెట్‌ నటించగా, లేడీ జెస్సికాగా రెబెకా ఫెర్గూసన్‌ నటించింది. వార్నర్‌ బ్రదర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న చిత్రంలో ఆస్కార్ ఐజాక్, జోష్ బ్రోలిన్, స్టెల్లన్ స్కార్స్‌గార్డ్, డేవ్ బటిస్టా, స్టీఫెన్ మెకిన్లీ హెండర్సన్, జెండయా, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, చాంగ్ చెన్, షారన్ డంకన్-బ్రూస్టర్, షార్లెట్ రాంప్లింగ్, జాసన్ మోమోవాలు నటిస్తున్నారు. చిత్రాన్ని యు.కె., యుఎస్ఏలతో పాటు కెనగా హంగేరిలోనూ డిసెంబర్ 18, 2020న ప్రేక్షకుల ముందకు రానుంది. చిత్రాన్ని ఐమాక్స్,3డిలలోను విడుదల చేస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.