భారత్‌లో పది భాషల్లో.. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9’

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ మామూలుది కాదు. ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి ఎనిమిది చిత్రాలు రాగా.. ఇప్పుడు తొమ్మిదో భాగం ప్రేక్షకుల్ని అలరించేందుకు ముస్తాబవుతోంది. జాసన్‌ స్టాథమ్, డ్వేన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ లిచ్‌ తెరకెక్కించారు. దీనికి ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా’ టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. స్ట్రీట్‌ రేసింగ్‌ నేపథ్యంతో యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడీ సినిమాను భారత్‌లో పది భాషల్లో విడుదల చేయబోతుంది యూనివర్సల్‌ పిక్చర్స్‌ ఇండియా సంస్థ. దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బోజ్‌పూరీ, పంజాబీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో ఈ మూవీ కనువిందు చేయబోతుందట. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

                                   


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.