అలరిస్తున్న ‘ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారి’ ట్రైలర్‌

ప్రముఖ అమెరికన్‌ కార్‌ డిజైనర్‌ కారోల్‌ షెల్బీ, బిట్రీష్‌ డ్రైవర్‌ కెన్‌ మైల్స్‌ల నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారి’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ఇందులో మ్యాట్‌ డామన్‌ కారోల్‌ షెల్బీగా నటిస్తుండగా, క్రిస్టియన్‌ బాలే కెన మైల్స్‌గా నటిస్తున్నారు. 20 సెంచరీ ఫాక్స్, చెర్నిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథేంటంటే 1963లో ఎంజో ఫెర్రారిని ఫోర్డ్‌ మోటారు కంపెనీని కొనుగోలు చేయడానికి సంప్రదిస్తారు. ప్రపంచంలోని ఎండ్యూరెన్స్‌ రేస్‌ 1923 నుంచి ప్రపంచంలో చాలామంది రేస్‌లో పాల్గొంటారు. కానీ హెన్రీ ఫోర్డ్‌ 2ని ఆ ఫోటీలో పాల్గొనకుండా చేస్తారు. దాంతో మనస్తాపం చెందిన హెన్రీ ఫోర్డ్‌ ఈ కార్‌ రేసింగ్‌లో పాల్గొనే ఫెర్రారి కార్‌ను రేసింగ్‌లో కారును ఓడించాలనుకుంటాడు. వెంటనే ఆటోమోటివ్‌ డిజైనర్‌ కారోల్, డ్రైవర్‌ కెన్‌ మైల్స్‌ కలిసి ఓ కారును తయారు చేస్తారు. ఈ రేస్‌లో ఫెర్రారి కారుకు ఫోర్డు కారు తట్టుకొని గెలిచిందా లేదా అనేది అంతిమ కథ. ఇంకా ఈచిత్రంలో కైట్రియెనా బాల్ఫే మోలీ మైల్స్‌ భార్యగా నటించగా, ఫోర్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా జోన్‌ బెర్నాల్త్‌ నటించారు. ఆగస్టు 30, 2019న టెల్లూరైడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడ విమర్శకుల నుంచి ఫర్వాలేదనిపించకున్న ఈ చిత్రం నవంబర్‌ 15, 2019న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.