పోరాటాలు చేస్తున్న ‘జెమినిమ్యాన్‌!

హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జెమినిమ్యాన్’. ఈ చిత్ర ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో విల్‌స్మిత్‌ పోరాటాలు చూస్తుంటే ఒళ్లు జలదరించినట్లు ఉంది. స్కైడ్యాన్స్ మీడియా, జెర్రీ బ్రూక్‌హ్మైర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంగ్‌ లీ దర్శకత్వం తెరకెక్కించారు. హెన్రీ బ్రొగాన్‌ (విల్‌ స్మి్‌త్‌) అనే వ్యక్తిని పోలి మరో వ్యక్తి ఉంటాడు. హెన్రీ చేయాలనుకున్న పనులన్నీ ముందే అతను చేసేస్తుంటాడు. దాంతో హెన్రీ అతన్ని హతమార్చాలనుకుంటాడు. ఎన్నిసార్లు చంపడానికి యత్నించినా ఓ దెయ్యంలా మాయమైపోయి తప్పించుకుంటూ ఉంటాడు. అసలు జెమినిమ్యాన్‌ ఎవరు? హెన్రీలాగే ఎందుకున్నాడు?అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు?అన్నదే కథ. అక్టోబర్‌ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.