‘సాహస పుత్రుడు’ వచ్చేస్తున్నాడు..

2004లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘హెల్‌ బాయ్‌’. మైక్‌ మిగ్‌నోలా దర్శకుడు. 2008లో ‘హెల్‌ బాయ్‌ 2’కూడా విడుదలైంది. ఈ పరంపరలో మూడో భాగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సాహస పుత్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. నీల్‌ మార్షల్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో డేవిడ్‌ హార్బర్‌, మిలా జోవిచ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత. శుక్రవారం విడుదల అవుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘స్పైడర్‌ మాన్‌, బ్యాట్‌మాన్‌, సూపర్‌ మాన్‌ తరహాలో సాగే ఓ సూపర్‌ హీరో కథ ఇది. భూతాలకు, హెల్‌ బాయ్‌కీ మధ్య జరిగే పోరాటాలు రసవత్తరంగా ఉంటాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటాయ’’న్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.