క‌రోనా ఎఫెక్ట్‌: తేదీలు మారిపోయాయి

హాలీవుడ్ అద్భుతం 'అవతార్' సీక్వెల్స్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయం. ఎందుకంటే నాలుగు సీక్వెల్స్​కు సంబంధించిన విడుదల తేదీలన్నీ మారిపోయాయి. 2021-2027లో రావాల్సినవి కాస్త 2022-2028కి వెళ్లిపోయాయి. కరోనా ప్రభావమే ఇందుకు కారణమని చెప్పిన డిస్నీ సంస్థ.. వీటితో పాటే స్టార్​వార్స్ చిత్రాలకు కొత్త విడుదల తేదీలను వెల్లడించింది.

'అవతార్' కొత్త విడుదల తేదీలు

అవతార్ 2: 2022 డిసెంబరు 16

అవతార్ 3: 2024 డిసెంబరు 20

అవతార్ 4: 2026 డిసెంబరు 18

అవతార్ 5: 2028 డిసెంబరు 22
'స్టార్​వార్స్' సినిమాల విడుదల తేదీలు:

2023 డిసెంబరు 22,

2025 డిసెంబరు 19,

2027 డిసెంబరు 17


కొవిడ్-19 ప్రభావం వల్ల తాము అనుకోని అవాంతరం ఎదుర్కొన్నామని చెప్పారు 'అవతార్' దర్శక-నిర్మాత జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం న్యూజిలాండ్​లో షూటింగ్ చేస్తున్నామని, అయితే లాస్ ఏంజెల్స్ జరగాల్సిన చిత్రీకరణ ఈ వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. అందువల్లే సీక్వెల్స్​ను అనుకున్న తేదీల్లో తీసుకురాలేకపోతున్నామని చెప్పారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.