ప్రచార పర్వానికి తెరలేపనున్న ‘జేమ్స్‌బాండ్‌’

తను ఒక అంతర్జాతీయ గూఢచారి. అతను చేరవేసే సమాచారంపై కొన్ని దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అతను చేసే సాహసాలు సూపర్‌ పవర్‌ ఉన్న కథానాయకులకి ఏ మాత్రం తీసిపోవు. అందుకే ‘జేమ్స్‌బాండ్‌’ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ ప్రాంఛేజిలో ఇప్పటి వరకూ 24 సినిమాలోచ్చాయి. 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ 2020 ఏఫ్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సినిమా ప్రచారచిత్రాన్ని ఈ బుధవారం చూపించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక టీజర్‌ను అంతర్జాలంలో విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మరోసారి గూఢచారిగా డేనియల్‌ క్రేగ్‌ కనిపించబోతున్నాడు. ఈ సినిమా తరువాత డేనియల్‌ జేమ్స్‌బాండ్‌గా నటించడని సమాచారం. ఈ సినిమాని 250 కోట్ల మిలియన్‌ డాలర్లతో తెరకెక్కించారని సమాచారం. ఇప్పుడీ టీజర్‌ అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.