యాంట్‌ మ్యాన్‌3లో జోనాథన్‌ మేజర్స్


యాంట్‌ మ్యాట్ ఆధారంగా ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెరపైకి వచ్చి అలరించాయి. అమెరికన్‌ సూపర్‌ హీరో చిత్రంగా వచ్చిన సీక్వెల్‌ చిత్రాలను మార్వెల్‌ స్డూడియోస్ నిర్మించగా వాల్ట్ డిస్నీ స్డూడియోస్‌ మోషన్‌ పిక్చర్స్ వీటికి పంపిణీదారుగా వ్యవహరించింది. ప్రస్తుతం యాంట్‌ మ్యాన్‌ 3 చిత్రానికి పేటన్‌ రీడ్‌ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా జోనాథన్‌ మేజర్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. జోనాథన్‌ కాంగ్‌ ది కాంకరర్‌ పాత్రను పోషించనున్నారు. ఇది ఒక సూపర్ విలన్‌ పాత్ర. మొదటి, రెండవ యాంట్‌ మ్యాన్‌ చిత్రాలకు పేటన్‌ రీడ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రధాన పాత్రల్లో మైఖేల్ డగ్లస్‌, ఎవాంజెలిన్‌ లిల్లీలు నటించారు. ఇక మూడో యాంట్‌ మ్యాన్‌గా నటిస్తున్న చిత్రం 2021 చిత్రీకరణ ప్రారంభమై, 2022న విడుదల కానుంది. జాక్‌ కిర్బీ కథను అందించగా, జెఫ్ లవ్నెస్‌ స్ర్కీన్‌ సమకూర్తుస్తున్నారు. కెవిన్‌ ఫీజ్‌ నిర్మాత. జోనాథన్‌ మేజర్స్ ఈ ఏడాది స్పైక్‌ లీ దర్శకత్వంలో వచ్చిన డా 5 బ్లడ్స్ చిత్రంలో డేవిడ్‌ అనే పాత్రలో నటించారు. గత ఏడాది జంగిల్‌ ల్యాండ్‌, గల్లీ, క్యాపిట్‌ స్టేట్‌నూ సందడి చేశారు. ది లాస్ట్ బ్లాక్‌ మ్యాన్‌ ఇన్‌ శాన్ ఫ్రాన్సిస్కో చిత్రంలో మోంట్‌గోమేరీ "మోంట్" అలెన్‌ పాత్రలో అద్భుతంగా అలరించారు. ప్రస్తుతం మేజర్స్, జేమ్స్ శామ్యూల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది హార్డర్ దే ఫాల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటుడు, నిర్మాత ఇద్రిస్‌ ఎల్బా కీలక పాత్రలో నటిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.