హత్యా రహస్యం చేధించే ‘నైవ్స్‌ అవుట్‌’

హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్, క్రిస్‌ ఇవాన్స్, అనా డే అర్మాస్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘నైవ్స్‌ అవుట్‌’. సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. కథలోకి వెళ్తే ప్రఖ్యాత క్రైమ్‌ నవలా రచయిత హర్లాన్‌ తోంబ్రే (కిస్టోఫర్‌ ప్లమ్మర్‌) తన ఎనభైయిదో సంవత్సరం పుట్టిన రోజు వేడుకలను తన ఎస్టేట్‌లో ఘనంగా జరపుకుంటాడు. తరువాత అనుమానస్పందగా చనిపోతాడు. ఈ హత్యను చేధించాడానికి దర్యాపు అధికారి బెనాయిట్‌ బ్లాంక్‌ (డేనియల్‌ క్రెయిగ్‌) పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ హత్యను ఇంట్లో పనివాళ్లు చేశారా లేక కుటంబ సభ్యులెవరైనా చేశారా అనేది మిగతా కథ. రియాన్‌ జాన్సన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌ కథా నేపథ్య చిత్రాన్ని మీడియా రైట్స్‌ క్యాపిటల్, రామ్‌ బెర్గ్‌మాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డేనియల్‌ క్రెయిగ్‌తోపాటు జామై లీ కర్టిస్, కేథరిన్‌ లంగ్‌ఫోర్డ్, రికి లిండ్‌హోమ్‌లాంటి నటీనటులు నటిస్తున్నారు. నవంబర్‌ 27, 2019న తెరపైకి రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.