ప్రిన్సెస్‌ డయానా పాత్రలో క్రిస్టెన్ స్టీవార్ట్‌!

ప్రముఖ హాలీవుడ్‌ నటి క్రిస్టెన్‌ స్టీవార్ట్ అనగానే వైవిధ్యమైన కథలో నటిస్తూ అలరిస్తున్న కథానాయికగా గుర్తొస్తోంది. తాజాగా ఈ అమ్మడు బ్రిటన్‌ రాజ వంశానికి చెందిన డయనా ప్రిన్స్ చార్లెస్‌ పాత్రలో నటించనుంది. పాబ్లో లారైన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి స్టీవెన్‌ నైట్‌ ‍ స్ర్కిప్టుని అందిస్తున్నారు. ఇందులో డయానా ప్రిన్స్ మరణాంతం వరకు సినిమా ఉండదు. తన భర్త చార్లెస్‌ నుంచి వేరుపడిన తరువాత ఆమె తన కొడుకుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. ఈ చిత్రం గురించి ప్లాబో లారైన్ మాట్లాడుతూ..‘‘రాజ వంశీకుల కుటంబం పట్ల ఆసక్తి, అక్కడి ఆచార వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. వాటిన్నికంటే కూడా డయానా చాలా శక్తివంతమైన మహిళా. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమె జీవితంపై చాలా సానుభూతి ఉంది. ఒక స్ర్తీ ఎలా ఉండాలో ఆమె నేర్పింది. ఆమె చార్లెస్‌ పెళ్లి చేసుకోవడానికి ముందే ఒక సామాన్య మహిళా ఉండాలని అనుకుంది. అలాంటి వ్యక్తి జీవితంపై సినిమా తీయాలనుకున్నాం. అందుకే ఈ సినిమాకి ‘స్పెన్సర్’ అని పేరు బాగుంటుందని’’ అన్నారు. సినిమా అంతా యువరాణి డయనా కథ అంతా ఆమె చివరి రోజుల్లో క్రిస్మస్‌ సెలవులో, హౌస్‌ ఆఫ్‌ విండర్స్ , ఇంగ్లాండ్‌లోని సాండ్రింగ్‌ హోమక్ష ఎస్టేట్‌లో జరిగిన ఉదంతాల చుట్టూ కథ ఉంటుందట. చిత్రాన్ని లారైన్‌, జువాన్‌ డి డియోస్‌, జోనాస్‌ డోర్న బాచ్‌, జూనైన్‌ జకోవిచ్‌, పాల్‌ వెబ్‌స్టర్లు నిర్మించనున్నారు. 2021లో చిత్రం ప్రారంభం కానుందట. ఇక క్రిస్టీన్‌ స్టీవార్ట్ గత ఏడాది చార్లెస్‌ ఏంజెల్స్ చిత్రంలో నటించి అలరించింది. ఈ ఏడాది ఆరంభంలో అడ్వెంచర్‌ సినిమాగా విలియం యుబాంక్ దర్శకత్వంలో అండర్‌వాటర్‌ అనే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి చిత్రం మాకెంజీ డేవిస్ సరసన క్లియా డువాల్ హ్యాపీయెస్ట్ సీజన్లో నటించనుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.