‘లాక్‌డౌన్’‌ చిత్రంలో ‘గాంధీ’ నటుడు బెన్‌ కింగ్‌స్లీ

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరి జీవితాల్ని అతలాకుతలం చేసింది కరోనా వైరస్‌ (కోవిడ్‌-19). ఈ వైరస్‌తోనే ప్రపంచమంతటా ‘లాక్‌డౌన్‌’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డగ్‌ లిమాన్‌ ‘లాక్‌డౌన్’‌ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో గాంధీ పాత్రధారి అయిన బెన్‌ కింగ్‌స్లీ, హన్నే హాత్‌వే, హీస్ట్ థ్రిల్లర్‌గా వస్తున్న చిత్రంలో మిండీ కాలింగ్‌, లూసీ బోయింటన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర కథేంటంటే కోవిడ్‌-19 వైరస్‌ను‌ అడ్డం పెట్టుకొని ప్రపంచంలోనే పత్ర్యేకమైన డిపార్ట్ మెంట్‌ స్టోర్‌ హర్దోస్‌ లిమిటెడ్‌ స్టోర్‌లో ఖరీదైన నగలను దొంగతనం చేయడానికి దంపతులుగా లిండా పాత్రలో అన్నే హాత్‌వే, పాక్స్టన్‌గా చివెటెల్ ఎజియోఫోర్ నటిస్తున్నారు. అక్కడ ఈ దంపతులు గొడవపడి ఖరీదైన ఆభరణాలను తస్కరించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ లండన్‌లో జరుపుకుంటోంది. ఇంకా చిత్రంలో బెన్ స్టిల్లర్, లిల్లీ జేమ్స్, స్టీఫెన్ మర్చంట్, డులే హిల్, జాజ్మిన్ సైమన్, మార్క్ గాటిస్ తదితరులు నటిస్తున్నారు. సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏజీసీ స్టూడియోస్‌, స్టోరీటెల్లర్‌ ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీవెన్‌ నైట్‌ కథను అందించగా మైఖేల్‌ లెస్లీ, పి.జె.వాన్‌ శాండ్‌విజ్క్, అలిసన్‌ వింటర్‌ నిర్మాతలుగా వ్య‍వహరిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.