రోమ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’

టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న అమెరికన్‌ గూఢచారి చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. కరోనా వైరస్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ ఆలస్యమైంది. ఇటీవలే రోమ్‌లో ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పెరుగుతున్న కోవిడ్‌ కేసుల కారణంగా ఇటలీలోనే చిత్రీకరణ ఆగిపోయింది. గత నెల్లో చాలామంది చిత్ర యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌-19 పాజిటివ్‌ రాగా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. తరువాత కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం నార్వేకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అనుమతి లభించడంతో కొద్ది వారాల క్రితం తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా ఎక్కువగా అవుడ్డోర్‌ షూటింగ్‌లు జరుపుకోవడంతో చిత్ర దర్శకుడు మెక్‌ క్వారీ తన చిత్రబృందంతో సామాజిక దూరంగా పాటిస్తూ షూటింగ్‌ని కొనసాగించాలని అభ్యర్థించాడట. ఈ చిత్రంలో క్రూజ్‌ ఏతాన్‌ హంట్‌ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఏతాన్‌ స్నేహితుడిగా వింగ్ రేమ్స్ నటిస్తున్నారు. స్కైడ్యాన్స్ మీడియా, టీజ పిక్చర్స్, న్యూ రిపబ్లిక్‌ పిక్చర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పారామౌంట్ పిక్చర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తుంది. చిత్రంలో ఇంకా హేలే అట్వెల్, సైమన్ పెగ్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, పోమ్ క్లెమెంటిఫ్, ఎస్సై మోరల్స్, హెన్రీ సెర్నీలు నటిస్తున్నారు. చిత్రం తొలుత జూలై 23, 2021న విడుదల చేయాలని భావించారు. కానీ చివరకు వచ్చే యేడాది నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.