భయపెడుతున్న కొరియా జోంబీ థ్రిల్లర్ ‘పెనిన్సులా

ప్రసిద్ధ కొరియా జోంబీ యాక్షన్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం ట్రైన్‌ టు బుసాన్‌ సీక్వెల్‌ చిత్రం ‘పెనిన్సులా’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన ‘ట్రైన్‌ టు బుసాన్’‌ చిత్రం అప్పట్లో ఆసియాలోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వస్తున్న ‘పెనిన్సులా’ చిత్రాన్ని ఈ పాటికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ‘ట్రైన్‌ టు బుసాన్’‌కి దర్శకత్వం వహించిన యోవాన్‌ సాంగ్‌ హో ఇప్పుడు ఆయనే దర్శకత్వం వహించారు. చిత్రంలో గ్యాంగ్‌ డాంగ్‌-వోన్‌, లీ జంగ్‌- హ్యూన్‌, లిరే, క్యాన్‌ హే హ్యోలు కీలక పాత్రలో నటిస్తున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.