పుంబా బ్రహ్మీ.. టిమోన్‌ అలీ!!

ప్రఖ్యాత డిస్నీ సంస్థ నుంచి టూడీ యానిమేటెడ్‌ సినిమాగా 1994లో విడుదలైంది ‘లయన్‌ కింగ్‌’. ఆ చిత్రం తాజాగా త్రీడీ యానిమేటెడ్‌ సాంకేతికతతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సొబగులద్దుకొని సరికొత్తగా ముస్తాబైంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఫాసా అనే సింహం, సింహం పిల్ల సింబ, ముంగిస టిమోన్‌, అడవి పంది పుంబా చుట్టూ సాగే కథ ఇది. తెలుగులో ఈ సినిమాకి ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, అలీ గాత్రదానం చేశారు. పుంబా పాత్రకి బ్రహ్మానందం, టిమోన్‌ పాత్రకి అలీ గొంతిచ్చారు. హిందీలో సింహం, సింహం పిల్ల పాత్రలకు షారుఖ్‌ఖాన్‌, ఆయన తనయుడు ఆర్యన్‌ఖాన్‌ గాత్రదానం చేశారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్యభాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’, ‘అల్లాద్దీన్‌’ తరహాలో ‘లయన్‌ కింగ్‌’ అలరిస్తుంద’’ని డిస్నీ ప్రతినిధులు తెలిపారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.