బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకి సినిమాలంటే పిచ్చి ప్రేమ. నటన అంటే ఆమెకు ప్రాణం. ఆమె దేశియ చిత్రాల్లోనే కాకుండా అంతర్జాతీయ సినిమాల్లోను నటిస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించి ‘ఏ కాల్ టు స్పై’ చిత్రం ఐఎఫ్సి ద్వారా విడుదల కానుంది. ఇదే విషయాన్ని రాధికే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె ఒక భారతీయ మూలాలున్న బ్రిటీష్ గుఢచారి నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చిత్రాన్ని 2019లో ఎడిసన్ బర్గ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో నియమించబడిన మహిళా గూఢచారుల ఆధారంగా లిడియో డీన్ పిల్చర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెరా అట్కిన్స్ (స్టానా కాటిక్) వర్జినియా హాల్‌గా (సారా మేఘన్ థామస్)లు నటించారు. ఈ సినిమా హక్కులను ఐఎఫ్సి ఫిల్మ్స్ సొంతం చేసుకొంది. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రాధికా ఆప్టే తెలుగులో ‘రక్తచరిత్ర’, బాలకృష్ణతో కలిసి ‘లైన్’, ‘లెజెండ్’ చిత్రాల్లో సందడి చేసింది.