చావు ముంచుకొస్తుందని వాళ్లకు తెలియాలి..

ప్ర
పంచవ్యాప్తంగా ‘రాంబో’ చిత్రాలకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్వెస్టర్‌ స్టాలోన్‌ను హాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా నిలబెట్టడంలో ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడీ సిరీస్‌కు ముగింపు కార్డు పడబోతుంది. ఈ సిరీస్‌ నుంచి ఐదో చిత్రంగా ‘రాంబో: లాస్ట్‌ బ్లడ్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబరు 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నేను మరణ ప్రపంచంలో బతికాను. నా కళ్ల ముందే నేను ప్రేమించిన వాళ్లు చనిపోవడం చూశాను’’ అంటూ స్టాలోన్‌ చెప్పిన సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఓ సరికొత్త రివేంజ్‌ డ్రామా నేపథ్యంతో చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. యాక్షన్‌ సన్నివేశాల్లో స్టాలోన్‌ నటన ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.