సాహసానికి సిద్ధమవుతున్న ‘రాంబో’

హాలీవుడ్‌ కథానాయకుడు సిల్వెస్టర్‌ స్టాలొన్‌ను స్టార్‌గా మార్చేసిన చిత్రం ‘రాంబో’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఐదో చిత్రంగా ‘రాంబో: లాస్ట్‌ బ్లడ్‌’ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. అందులో స్టాలొన్‌ సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కిడ్నాప్‌ అయిన స్నేహితుడి కుమార్తెను కాపాడటానికి రాంబో చేసే సాహసాలతో ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబరు 20న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.