ధనిక కుటుంబంలో ఏం జరిగింది?

హాలీవుడ్‌ దర్శకులు మాట్‌ బెట్టినెల్లి - టైలర్‌ గెల్లెట్‌ సంయుక్త దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రెడీ ఆర్‌ నాట్‌’. ఇదొక విచిత్రమైన కథతో కొనసాగుతున్న ఓ ధనిక కుటుంబంలో జరిగే విశేషాల సమాహారమే ఈ చిత్రం. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో నటి సమార వీవింగ్‌ గ్రేస్‌ పాత్రలో ఓ ధనవంతుల ఇంట్లోకి పెళ్లి కూతురుగా అడుగుపెడుతుంది. అక్కడ పరిస్థితులు ఓ పట్టాన అర్థం కావు. కానీ అంతలోనే ఇంట్లో సాంప్రదాయంగా వస్తున్న ఓ భయంకరమైన ఆట మొదలవుతుంది. ఆ ఆటలో ఒకరినొకరు చంపుకుంటుంటారు. ఇందులో ఎవరు ఎలా ప్రాణాలతో బయటపడ్డారనేది కథలోని ముఖ్యాంశం. ఫాక్స్‌ సెర్చ్‌లైట్‌ పిక్చర్స్, మైథాలజీ ఎంటర్‌టైన్‌ ఫిల్మ్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమార వీవింగ్, ఆడమ్‌ బ్రాడీ, మార్క్‌ ఓ బ్రైయిన్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఆండీ మాక్‌డోవల్, క్రిస్టియన్‌ బ్రున్, నిక్కీ, హెన్నీ తదితరులు నటిస్తున్నారు. వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, మోషన్‌ పిక్చర్స్‌ పంపిణిదారులుగా వ్యవరిస్తున ఈ సినిమా ఆగస్టు 23, 2019న తెరపైకి రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.