రస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో క్రిస్‌ ఎవాన్స్‌-ర్యోన్‌ గ్లోసింగ్‌

రస్సో బద్రర్స్‌ దర్శకత్వంలో హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఎవాన్స్, ర్యాన్‌ గ్లోసింగ్‌లు కలిసి నటించనున్న చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’. ‘అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌’ తరువాత రస్సో బద్రర్స్‌ చేస్తున్న అతిపెద్ద భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. మార్క్‌ గ్రీనీ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘ఎట్రాక్షన్‌’ చిత్రం తరువాత నెట్‌ఫ్లిక్స్‌ భాగస్వామ్యంతో స్పై థ్లిల్లర్‌ చిత్రంగా జేమ్స్‌బాండ్‌ స్థాయిలో ఫ్రాంఛైజీ చిత్రంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. గ్లోసింగ్, ఎవాన్స్‌ పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయని దర్శకుడులో ఒకరైన జో రస్సో చెప్పారు. ఈ చిత్ర స్క్రిప్టుని జోరస్సోతో పాటు చిత్ర రచయితలు స్టీఫెన్‌ మెక్‌ఫీలి, క్రిస్టోఫర్‌ మార్కస్‌లు పాలు పంచుకున్నారట. ‘గ్రే మ్యాన్‌’ చిత్ర కథంతా ఒక మాజీ సీఐఏ హత్య నేపథ్యం చుట్టూ తిరిగనుందట. ఇందులో హంతకుడు కోర్ట్‌ జెంట్రీ పాత్రలో ర్యాన్‌ గ్లోసింగ్‌ నటిస్తుండగా, క్రిస్‌ ఎవాన్స్‌ సీఐఏ మాజీ అధిపతి ఎంజెట్‌ అయిన లాయిడ్‌ హాన్సెన్‌ పాత్రలో నటించనున్నాడు.




View this post on Instagram

A post shared by Chris Evans (@chrisevans) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.