కిమ్‌ కాట్రాల్‌ లేకుండా వస్తోన్న ‘సెక్స్ అండ్‌ ది సిటీ’

అమెరికన్‌ పాపులర్‌ టీవీ షో ‘సెక్స్ అండ్ ది సిటీ’. 1998 నుంచి 2004 వరకు జనాదారణ పొందిన ఈ ధారవాహిక ఇప్పుడు మల్లీ ప్రారంభం కానుంది. ఆ షో తారలైన సారా జెస్సికా పార్కర్‌, సింథియా నిక్సన్‌, కిర్సిన్‌ డేవిస్‌లు తిరిగి కొత్త అధ్యాయంతో మొదలుపెడతామని నటీమణులు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్‌తో సహా ప్రకటించారు. ఈ ముగ్గురు తారలతో కలిసి మైఖేల్‌ పాటిక్ర్ కింగ్‌ ప్రాజెక్టెని నిర్మిస్తున్నారు. తిరిగి వసున్న ఈ షోలో క్యారీ బ్రాడ్‌షా (సారా జెసికా పార్కర్), షార్లెట్ యార్క్ ( క్రిస్టిన్‌ డేవిస్) ​మిరాండా హాబ్స్ (నిక్సన్)లను అనుసరిస్తుంది. ఎందుకంటే వారు నాటి  ప్రేమ స్నేహాన్ని నావిగేట్ చేస్తారు. ఈ పరిమిత సిరీస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌ లేదా మేలో న్యూయార్క్‌లో ప్రారంభమవుతుంది. డరేన్‌ స్టార్‌, ఈ షోని కాండేష్‌ బుష్నెల్‌ రాసిన పుస్తకం ఆధారంగా సృష్టించారు. అంతేకాదు దీన్ని 2008లో వెండితెరపై ‘సెక్స్ అండ్‌ ది సిటీ’, మరోసారి 2010లో సీక్వెల్‌గా ‘సెక్స్ అండ్‌ ది సిటీ2’గా తెరకెక్కించారు. సెక్స్ అండ్‌ ది సిటీకి ప్రీక్వెల్స్ కి బుష్నెల్‌ రాసిన ‘ది క్యారి డైరీస్’‌, 2010, ‘సమ్మర్‌ అండ్‌ ది సిటీ’ నవలలను ఆధారంగా తీసుకొని 2013-14 బుల్తితెర సీరీస్‌గా ది సీడబ్లులో ప్రసారం చేశారు. మరోసారి వీటిని హెబీఓ మాక్స్ లో పునఃప్రారంభం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


View this post on Instagram

A post shared by I Talk Telly (@italktelly)

 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.