తోడికోడళ్లైన సోఫీ టర్నర్, ప్రియాంక చోప్రా

ప్రముఖ హాలీవుడ్‌ నటి అయిన సోఫీ టర్నర్‌ తన ప్రియుడు జోయ్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకొంది. వీరిద్దరు చాలా కాలం నుంచి డేటింగ్‌లో ఉంటూ 2017లో ఏంగేజ్‌ మెంట్‌ చేసుకున్నారు. మేడే రోజునే వీరిద్దరూ అధికారింగా దంపతులైయ్యారు. అన్నట్లు ఈ సోఫీ టర్నర్‌ పెళ్లి చేసుకొంది ఎవరోనో కాదండోయ్‌ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు స్వయానా బావ జోయ్‌ జోనాస్‌నే. ఇరవైమూడు సంవత్సరాల సోఫీ ‘ఎన్‌దర్‌ మి’ 2013తో వెండితెరకు పరిచమైంది. ఆ తరువాత ‘బరేలి లీథల్‌’, ‘జోస్సీ’, ‘డార్క్‌ ఫోనిక్స్‌’ చేసింది. అంతర్జాతీయంగా ఆకట్టుకున్న ‘గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌ -సీజన్‌8’ చిత్రంలో సోఫీ టర్న్‌ది ప్రధాన పాత్ర. విశేషం ఏమిటంటే ప్రియాంక తన కంటే వయస్సులో చాలా చిన్నవాడైన నిక్‌ జోనాస్‌ను పెళ్లాడగా, సోఫీ మాత్రం తనకంటే ఆరు సంవత్సరాలు పెద్దవాడైన జోయ్‌ని పెళ్లి చేసుకొంది. మొత్తం మీద ప్రియాంక, సోఫీలు ‘తోడికోడళ్లు’ అయ్యారన్న మాట.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.