ఆకట్టుకుంటున్న ‘టెనెట్’‌ ట్రైలర్‌

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘టెనెట్‌’. మూడవ ప్రపంచ యుద్దాన్ని నివారించే ఒక రహస్య ఏజెంట్‌ నేపథ్యంగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏడు దేశాలలో చిత్రకరించిన ఈ సినిమాలో రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, డింపుల్ కపాడియా, ఆరోన్ టేలర్-జాన్సన్, క్లెమెన్స్ పోసీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానాగ్‌లు కలిసి సందడి చేస్తున్నారు. చిత్రం ముంబైలోని గేట్‌ ఆఫ్‌ ఇండియా, తాజ్‌ మహల్‌ హోటల్‌ను చిత్రీకరించారు. సింకోపీ ప్రొడక్షన్, వార్నర్‌ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ డైరెక్టర్ హొయెట్ వాన్ హోయిటెమా చేస్తుండగా, లుడ్విగ్ గెరాన్సన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో భారత సంతతికి చెందిన హిమేష్‌ పటేల్‌తో పాటు బాలీవుడ్ నటి డింపుల్‌ కపాడియా కూడా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తోపాటు ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌ కూడా అలరించేవాల ఉంది. వార్నర్‌ బ్రదర్స్ పంపిణీ దారుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జులై 17, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.