ఉత్కంఠత రేపుతున్న ‘టెర్మినేటర్‌: డార్క్‌ పేట్‌’ ట్రైలర్‌

హాలీవుడ్‌ టెర్మినేటర్‌ నటుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ పేట్‌’. అమెరికన్‌ సైన్స్‌ యాక్షన్‌ చిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి టిమ్‌ మిల్లర్‌ దర్శకుడు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలైంది. టీజర్లో.. నటుడు గ్రాబియేల్‌ లునా రెవ్‌-9 అనే ద్రవంగా మారిపోయే టెర్మినేటర్‌గా నటించగా, మరో నటుడు డైగో బొనెటో మైగుల్‌ రామోస్‌ అనే టెర్మినేటర్‌గా నటిస్తున్నారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పారామౌంట్‌ పిక్చర్స్, 20 సెంచరీ ఫాక్స్, లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి జేమ్స్‌ కామెరూన్, డేవిడ్‌ ఎల్సిన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టెర్మినేటర్‌ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ది టెర్మినేటర్‌’, ‘టెర్మినేటర్‌2:జడ్జిమెంట్‌ డే’ చిత్రాలకు టెర్మినేటర్‌ డార్క్‌పేట్‌ కొనసాగింపు చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇందులో లిండా హమిల్టన్‌ సర్హా కొన్నర్‌గా నటించగా, మరో నటి నటాలియా రేస్, మెకంజీ డేవిస్‌లు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 1, 2019న ప్రేక్షకుల ముందకురానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.