అలరిస్తున్న ‘ది కింగ్‌ ఆఫ్‌ స్టేటెన్‌ ఐలాండ్‌’ ట్రైలర్‌

పచ్చబొట్టు కళాకారుడిగా రాణించాలనే ఓ యువకుడి జీవితం అనుకోకుండా వేరే వృత్తిలలో చేరాల్సి వస్తుంది. అలాంటి యువకుడు కుటుంబ పరిస్థితులను అనుగణం ఎలా నడుచుకున్నాడనే కథ ఆధారంగా హాస్య చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘ది కింగ్‌ ఆఫ్‌ స్టేటెన్‌ ఐలాండ్‌’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటుంది. జుడ్‌ అపాటో దర్శకత్వంలో పీట్‌ డేవిడ్‌ సన్, మౌడ్‌ అపాటో, మారిసా టోమీ, బిల్‌ బర్‌, డేవిడ్స్‌న్‌లు నటించారు. జనవరి 19, 2019లో ప్రకటితమైన ఈ చిత్రం, జూన్‌ 3న షూటింగ్‌ మొదలుపెట్టింది. ఆ తరువాత చకాచకా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం,  ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రిమియర్‌ షో వేయాల్సింది. కరోనా వైరస్‌ వ్లల వాయిదా పడింది. ఇప్పుడు కరోనాతో థియేటర్లు మూతపడగా, ఆన్‌లైన్లో‌ విడుదల చేసేందుకు సన్నద్దమాయ్యారు.  జూన్‌ 12, 2020న వీఓడి (వీడియో-ఆన్‌-డిమాండ్‌) ద్వారా విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుంది. అప్టో ప్రొడక్షన్స్, ఫర్‌పెక్ట్‌ వరల్డ్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యూనివర్సల్‌ పిక్చర్స్‌ పంపిణీదారుగా వ్యవహరిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.