‘లయన్‌ కింగ్‌’ కోసం జగ్గూభాయ్‌

‘ది లయన్‌ కింగ్‌’.. 1994లో విడుదలై ప్రపంచ సినీప్రియుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు యానిమేటెడ్‌ ఫాంటసీగా సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. జాన్‌ ఫావ్రో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వాల్ట్‌ డిస్నీ - మార్వెల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో కీలకమైన స్కార్‌ (సింహం) పాత్రకు సీనియర్‌ నటుడు జగపతిబాబు డబ్బింగ్‌ చెప్పగా.. ముఫార్‌ పాత్రకు ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్, నటుడు రవిశంకర్‌ స్వరానిచ్చారు. ఇక ఈ సినిమాలోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రలకు అలీ వాయిస్‌ ఓవర్‌ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో విడుదల కాబోతుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.