టామ్‌ క్రూజ్‌ చిత్రానికి డౌగ్‌ లిమాన్‌ దర్శకత్వం!


ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ ఓ కొత్త సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకి దర్శకుడిగా డౌగ్‌ లిమాన్‌ వ్యవహరించనున్నాడు. చిత్రం బాహ్య అంతరిక్షంలో చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌  చిత్రానికి నాసా, ఎలోన్‌ మస్క్ సంస్థలు నిర్మాణానికి సహాకారం అందించనున్నారు. ప్రస్తుతానికి సినిమాకి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. చాలా కాలం క్రితం టామ్ క్రూజ్ అంతరిక్షంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలతో సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈనెల మొదటి వారంలో ట్వీట్ రూపంలో నాసా ధృవీకరించింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. గతంలో డౌగ్‌ లిమాన్‌ ‘మిస్టర్‌.అండ్‌ మిస్టర్ట్స్ స్మిత్‌’, ‘ది బోర్న్ ఐడెంటిటీ’, ‘ఫెయిర్‌ గేమ్’‌లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాదు గతంలో టామ్‌ క్రూజ్‌ ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి దర్శకుడు డౌగ్‌ లిమాన్. మొత్తం మీద అంతరిక్షంలో తొలిసారిగా నటించిన నటుడు టామ్‌, అంతరిక్షంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించిన మొదటి దర్శకుడు కూడా డౌగ్‌ లిమాన్‌ పేర్లు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం టామ్‌ క్రూజ్‌ ‘టాప్‌ గన్‌:మావెరిక్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 23న విడుదల కానుంది. క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘మిషన్‌ ఇంఫాజిబుల్‌ 7’ చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌ 19న విడుదల కానుంది. ఇందులో టామ్ క్రూజ్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హెన్రీ సెర్నీ తదితరులు నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.