విల్‌స్మిత్‌.. టామ్‌ హోలాండ్‌ ఇలా మారారు!!

ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌స్మిత్, టామ్‌ హోలాండ్‌ యానిమేటెడ్‌ బొమ్మలుగా మారి ‘స్పైస్‌ ఇన్‌ డిస్‌గైజ్‌’ చిత్రంతో అలరించేందుకు ముస్తాబువుతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. లాన్స్‌ అనే సూపర్‌ స్పై (విల్‌ స్మిత్‌), వాల్టర్‌ బెకెట్‌ అనే శాస్త్రవేత్త (టామ్‌ హోలాండ్‌) శత్రువులు. లాన్స్‌ నెమ్మదస్తుడు. వాల్టర్‌ అలా కాదు. వాల్టర్‌ చేసే పనులు లాన్స్‌కు చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రపంచాన్ని కాపాడేందుకు చేతులు కలపాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో వాల్టర్‌ కనిపెట్టిన ఓ మందుని లాన్స్‌ తాగేస్తాడు. దాంతో అతని శరీరంలో మార్పులు జరిగి పావురంలా మారిపోతాడు. మరి ప్రపంచాన్ని కాపాడటానికి వీరిద్దరూ కలిసి ఏం చేశారు? అన్నదే సినిమా కథ. ప్రముఖ దర్శకులు ట్రాయ్‌ క్వేన్‌, నిక్‌ బ్రూనో సంయుక్తంగా ఈ యానిమేటెడ్‌ స్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.