ఇదుగో.. సరికొత్త ‘వండర్‌ ఉమెన్‌’

థానాయిక ప్రాధాన్యం ఉన్న సూపర్‌ హీరో చిత్రం ‘వండర్‌ ఉమెన్‌’. 2017లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది. గాల్‌ గడట్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘వండర్‌ ఉమెన్‌ 1984’ తెరకెక్కుతోంది. పాటీ జెన్‌కిన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బంగారు రంగు సూట్‌లో గాల్‌ గాడోట్‌ ఆకట్టుకొనేలా ఉంది. తొలి చిత్రంలో వారియర్‌ ప్రిన్స్‌ డయానా పాత్రలో గాల్‌ నటన, భారీ యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సీక్వెల్‌లో అంతకుమించిన సాహసాలతో వండర్‌ ఉమెన్‌ అలరిస్తుందని చిత్రాన్ని నిర్మిస్తున్న వార్నర్‌ బ్రదర్స్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.