‘వండర్‌ ఉమన్‌’ అప్పుడొస్తుంది!

హాలీవుడ్‌ కథానాయిక గాల్‌ గాడోట్‌ నటిస్తున్న చిత్రం ‘వండర్‌ ఉమన్‌2’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. తాజాగా గాల్‌ గాడోట్‌ డయానా ప్రిన్స్‌ పాత్రలో బంగారు కవచంతో ఉన్న పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని జూన్‌ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 2017లో వచ్చిన ‘వుండర్‌ ఉమన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాట్టి జెన్స్‌కిన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో క్రిస్‌ పైన్, క్రిస్టిన్‌ విగ్, పెడ్రో పాస్కల్‌ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.