‘ఎక్స్‌-మెన్‌’ డార్క్‌ ఫినిక్స్‌ తెలుగు ట్రైలర్‌ చూశారా !!

హాలీవుడ్‌లో విజయవంతమైన భారీ యాక్షన్‌ ఫిక్షన్‌ చిత్రాల్లో ‘ఎక్స్‌ మెన్‌’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. 19 ఏళ్లుగా ఈ ‘ఎక్స్‌ మెన్‌’ సిరీస్‌ నుంచి వచ్చిన చిత్రాలన్నీ మంచి హిట్లు అందుకున్నాయి. అవన్నీ ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇక ఇప్పుడీ సిరీస్‌కు ముగింపు కార్డు వేయబోతోంది మార్వెల్‌ స్టూడియోస్‌. ఈ సిరీస్‌ నుంచి రాబోతున్న చివరి చిత్రం ‘ఎక్స్‌ మెన్‌: డార్క్‌ ఫోనిక్స్‌’. మార్వెల్‌ స్టూడియోస్, ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల మ³ందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్లను విడుదల చేశారు. ‘ఎక్స్‌ మెన్‌’ గత చిత్రాల్లాగే ఇది కూడా అద్భుతమైన గ్రాఫిక్స్‌ హంగులతో ఆకట్టుకునేలా ఉంది. జెన్నీఫర్‌ లారెన్స్, మైఖేల్‌ ఫాస్‌బెండర్, నికోలస్‌ హౌల్ట్, సోఫియా టర్నర్, జేమ్స్‌ వంటి భారీ తారాగణం ఇందులో ప్రధాన పాత్రలు పోషించింది. కథానాయిక తన అతీంద్రియ శక్తులతో కార్లను, హెలికాప్టర్లను గాల్లో పల్టీలు కొటించడం వంటివి ఆకటుకునేలా ఉన్నాయి. ‘ఎక్స్‌మెన్‌’ చిత్రాల్లో గత కొన్నేళ్లుగా కొత్తదనం కనిపించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి మార్వెల్‌ సంస్థ డిస్నీ తరహాలో పిల్లల్ని, పెద్దల్ని అలరించేలా ఈ సినిమాను రూపొందించారట. ట్రైలర్‌ను కూడా దీనికి తగ్గట్లుగానే కట్‌ చేసినట్లు తెలుస్తోంది.
 
                                     


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.