పులిట్జర్‌ నాటకం... ఐదు ఆస్కార్ల చిత్రం

ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్‌ బహుమతి అందుకున్న ఓ నాటకాన్ని సినిమాగా మలిస్తే అది జనాదరణ పొందడమే కాకుండా అయిదు ఆస్కార్‌ అవార్డులను అందుకుంది. ఆ సినిమానే ‘ఎ స్ట్రీట్‌కార్‌ నేమ్డ్‌ డిజైర్‌’ (1951). ఆరు దశాబ్దాల పాటు విలక్షణ నటుడిగా ప్రాచుర్యం పొందిన మార్లన్‌బ్రాండో, ఉత్తమ నటిగా రెండు ఆస్కార్లు అందుకున్న నటి వివియన్‌లీ నటించిన ఈ చిత్రం రూపాయి పెట్టుబడికి 8 రూపాయలు ఆర్జించింది. ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఒక మగవాడి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ప్రేమలు, అనుబంధాలు, కోరికలు, అహంకారాలు, ఆధిక్యతలు లాంటి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. అనుకోకుండా ఆస్తి పోగొట్టుకున్న అక్క, విధిలేక తన చెల్లెలు పంచన చేరాల్సి రావడం... చెల్లెలు భర్త దౌర్జన్యపూరితమైన ప్రవర్తన వల్ల అగచాట్లు పడడం... ఆ ఇద్దరి ఆడవారితో అతడు వ్యవహరించిన తీరుతెన్నుల నేపథ్యంలో కథ సాగుతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.