తన కథ తనే తీసుకున్న దర్శకుడు!

సినిమా పేరును ఒక అంకె సూచిస్తుంది. అది 8 పక్కన అర. అంటే ‘ఎయిట్‌ అండ్‌ హాఫ్‌’ (ఎనిమిదిన్నర) అన్నమాట. ఇది ఓ హాలీవుడ్‌ దర్శకుడు తన గురించి తనే తీసుకున్న సినిమా. మరి ‘ఎనిమిదిన్నర’కి అర్థం ఏమిటి? ఏంటంటే... అది ఆ దర్శకుడు అప్పటి వరకు తీసిన సినిమాల సంఖ్య. మరి ‘అర’ సినిమా ఏంటి? అది అతడు మరో దర్శకుడితో కలిసి తీసిన సినిమా. ఆ దర్శకుడు ఫెడెరికో ఫెల్లిని. ఇటాలియన్‌. ప్రపంచ సినిమాపై గొప్ప ప్రభావం చూపిన దర్శకుడిగా ప్రాచుర్యం పొందాడు. యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఇతడు ఇటలీ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారంతో పాటు, కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అత్యునత అవార్డును, నాలుగు ఆస్కార్‌లను, జీవిత కాల పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి. ఇలాంటి ఫెడెరికో, తన జీవిత కథను, తను అంతవరకు తీసిన సినిమాల వివరాలను కలిపి హాస్యభరితంగా, వ్యంగ్యాత్మకంగా తీసిన సినిమానే ‘ఎనిమిదిన్నర’ (1963). ఈ సినిమా ప్రపంచంలోనే గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ విదేశీ చిత్రం, కాస్ట్యూమ్స్‌ విభాగాల్లో రెండు ఆస్కార్లు సహా అనేక అవార్డులు గెల్చుకోవడం విశేషం. ఓ దర్శకుడిగా గొప్ప హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన తరువాత ఎలాంటి సినిమా తీయాలో తోచక సతమతమవడం, దాన్ని అధిగమించడానికి ప్రయత్నించడం లాంటి మానసిక పరిస్థితులకు కూడా అద్దం పడుతుంది. ఇతడు తన జీవితంలో తాను ప్రేమించిన అమ్మాయిల సంగతులను కూడా పొందుపరిచాడు.

                     


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.