పూల దొంగ కథ

ఎవరైనా వజ్రాలో, బంగారమో, డబ్బో దొంగతనం చేస్తారు. కానీ పూలను ఎవరైనా దొంగిలిస్తారా? అలాంటి ఓ పూల దొంగపై ఓ పుస్తకం రావడం వింత అయితే, ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీయడం ఓ విచిత్రం. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బ్రిటిష్‌ అకాడమీ, బాఫ్తాలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించింది. పైగా హాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు నికొలాస్‌ కేజ్, మెరిల్‌ స్ట్రీప్, క్రిస్‌ కూపర్‌లాంటి వాళ్లు నటించిన ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైంది కూడా. ఆ సినిమా ‘ఎడాప్టేషన్‌’ (2002). నిజానికి ఇది ఓ వాస్తవిక సంఘటన ఆధారంగా జరిగిన కథే. సుసాన్‌ ఓర్లియన్‌ అనే ఓ జర్నలిస్ట్‌ రాసిన ‘ద ఆర్కిడ్‌ థీఫ్‌’ రాసిన పుస్తకం దీనికి ఆధారం. అరుదైన ఆర్కిడ్‌ జాతి పుష్పాలను అక్రమంగా వేరే దేశాలకు రవాణా చేస్తున్నారనే ఆరోపణపై ఫ్లోరిడాలో 1994లో కొందర్ని అరెస్ట్‌ చేశారు. ‘ఘోస్ట్‌ ఆర్కిడ్స్‌’ అనే విలువైన పుష్పజాతి మొక్కలకు నకిలీలను సృష్టిస్తున్నారనే ఈ సంఘటనపై ఆ జర్నలిస్ట్‌ పరిశోధన చేసి వార్తా కథనాలతో పాటు పుస్తకాన్ని వెలువరించింది. పుస్తకంలోని విషయాల ఆధారం చేసుకునియ కల్పిత కథనాన్ని అల్లుకుని ఓ థ్రిల్లర్‌ సినిమాగా దీన్ని తీశారు. ఇందులో నికొలాస్‌ కేజ్‌ కవల సోదరుల పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ పుస్తకం ఆధారంగా ఓ సినీ స్కీన్ర్‌ప్లే రచయితను స్క్రిప్ట్‌ రాయమనడం, సరైన వివరాలు లేక అతడు రాయలేకపోతున్న తరుణంలో అతడి కవల సోదరుడు అతడి స్థానంలో రచయితగా రంగప్రవేశం చేసి సినిమా కథ అల్లేయడం లాంటి సంఘటనలతో ఇది ఓ వ్యంగ్మాత్మక, ఉత్కంఠభరిత చిత్రంగా రూపొందింది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.