టోక్యోలో 4 నెలల తరువాత తెరుచుకున్న డిస్నీల్యాండ్

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వల్ల ప్రపంచంలోని పలురంగాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలు తేరుకుంటున్నాయి. తాజాగా టోక్యోలోని డిస్నీల్యాండ్‌ - డిస్నీ సియాలు తిరిగి తెరుచుకున్నాయి. గత నాలుగు నెలలుగా కోవిడ్‌-19 కారణంగా ఈ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సందర్శకులు వల్ల కరోనా వైరస్‌ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకొనున్నారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి టోక్యో డిస్నీల్యాండ్‌ మూసివేశారు. టోక్యోలోని డిస్నీల్యాండ్‌ పార్కుని 2018లో సుమారు 18 మిలియన్ల మంది సందర్శించారు. పోర్లీడా మరియ కాలిఫోర్నియా తరువాత డిస్నీల్యాండ్‌ తన మూడో థీమ్‌పార్కుని టోక్యోలో 1983న నిర్మించింది. నాలుగు నెలల తరువాత తిరిగి ప్రారంభమైన ఈ పార్కు ప్రతిరోజు 12 గంటలు మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మూడు సాట్లలలో మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇచ్చేందకు నిర్ణయం తీసుకున్నారట. ఇంకా పార్కులో కవాతులు, ప్రదర్శనల వంటి కార్యక్రమాలు ప్రస్తుతానికి నిలిపివేశారు. సందర్శకుల ఆరోగ్యమే మాకు ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత పరిశుభ్రత, అన్ని రకాల పరీక్షలు నిర్ణయించాకే అనుమతి ఇచ్చి. వారిని ఈ వ్యాధి నుంచి జాగ్రత్త చర్యలు తీసుకునేలా టిక్కెట్లు కొన్నప్పటి నుంచి అన్ని విధాల వారికి సహకరిస్తామని ఇప్పటికే సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం టోక్యోలో డిస్నీల్యాండ్‌ తెరుచుకోవడంతో వీరి మరొక ఫ్రాంచైజ్‌ సంస్థ షాంఘై, హాంకాంగ్‌ పార్కులను తమ కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వీటి తరువాత వరుసగా ఈ నెల మొదటివారంలోనే ఓర్లాండో, పారిస్‌లో ప్రారంభించడానికి సిద్ధమైయ్యారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.