అల్లాదిన్‌’ అదరగొడుతున్నాడు

‘అల్లాదిన్‌’.. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు పరిచయమక్కర్లేని పేరు. బుల్లితెరపై కార్టూన్‌ సీరియల్‌గా కొన్నేళ్లపాటు చిన్నారులను అలరించిన ఈ ‘అల్లాదిన్‌’ ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తోంది. ఇందులో జీనీగా హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్‌స్మిత్‌ నటించగా.. అల్లాదిన్‌ పాత్రను మసూద్‌ పోషించాడు. ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ కనిపించింది. గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు భారీ కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. ఇది ఆదివారం నాటికి వరల్డ్‌ వైడ్‌గా 121 మిలియన్‌ డాలర్లు (రూ. 840కోట్లు) వసూలు చేసి ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వచ్చిన మొత్తంలో ఒక్క ఉత్తర అమెరికా నుంచే 86 మిలియన్‌ డాలర్లు (రూ.597 కోట్లు) రాబట్టడం మరో విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్‌ ముందు అల్లాదిన్‌ జోరు చూస్తుంటే సోమవారం నాటికి ఉత్తర అమెరికాలో 100 మిలియన్‌ డాలర్ల మార్కును క్రాస్‌ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌లో జీనీ పాత్రకు విక్టరీ వెంకటేష్ డబ్బింగ్‌ చెప్పగా.. అల్లాదిన్‌ పాత్రకు యువ హీరో వరుణ్‌ తేజ్‌ స్వరం అరువిచ్చారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.