
లాస్ఏంజెల్స్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ హాలీవుడ్ సిరీస్‌లో అతిథి పాత్రలో నటించనున్నారు. హాలీవుడ్లో పాపులర్ అయిన కామెడీ సిరీస్ ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లో గేట్స్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ ఎపిసోడ్‌ను వచ్చే నెల ప్రసారం చేయనున్నారు. అయితే గేట్స్ ఇందులో వేరే పాత్రలో కాకుండా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే నటిస్తారు.
సిరీస్‌లో భాగంగా నిర్వహించే ఓ కార్యక్రమానికి గేట్స్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఆయనతో పాటు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తదితరులు పాల్గొననున్నారు. ఇలాంటి సిరీస్‌లో గేట్స్ నటించడం ఇది తొలిసారేం కాదు. 2001లో వచ్చిన ‘ఫ్రాసియర్’ అనే కామెడీ సిరీస్‌లోనూ గేట్స్ అతిథి పాత్రలో నటించారు. అయితే ఇలాంటి చిన్న పాత్రలకు గేట్స్ పారితోషికం తీసుకోరట.