అంతరిక్షం నుండి ఉపద్రవం...

వేరే గ్రహం మీద నివసించి అక్కడి పరిస్థితుల్ని అంచనా వేయడం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ‘సింథటిక్‌ మనుషుల్ని’ తయారు చేస్తారు... వాళ్లు మనం చెప్పినట్టు వినే రోబోల్లాంటి వాళ్లన్నమాట... బయో ఇంజినీరింగ్‌ ద్వారా రూపొందించిన వాళ్లకి రెప్లికెంట్స్‌ అని పేరు పెడతారు... ఇంచుమించు బానిసల్లాగా ఉపయోగించుకుంటారు. అయితే వాళ్లు సొంత తెలివిని అభివృద్ధి చేసుకుని ఓ అంతరిక్ష నౌకను ఆక్రమించుకుని భూమి మీదకు దండెత్తుతారు. తమను తయారు చేసిందెవరో తెలుసుకోవడం వారి లక్ష్యం. భూమ్మీదకు చేరిన వాళ్లు మామూలు మనుషుల్లాగా కలిసిపోయి తిరుగుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు రెప్లికెంట్స్‌ అని ఎలా బయట పడింది? వారికి, మానవులకి మధ్య పోరాటాలు ఎలా జరిగాయి? ఇవన్నీ కలిపితే సినిమా కథ. ఈ కథతో సైన్స్‌ఫిక్షన్‌గా రూపొందిన చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’ (1982). ప్రఖ్యాత నటుడు హారిసన్‌ ఫోర్డ్‌ నటించిన ఈ సినిమా ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘బ్లేడ్‌ రన్నర్‌ 2049’ సినిమా 2017లో విడుదలైంది. ఈ సినిమా ఎన్నో వీడియోగేమ్స్‌కు, టీవీ సీరియల్స్‌కి, యానిమేషన్‌ చిత్రాలకి నాంది పలికింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.