భారతీయ ప్రతిభకు కేన్స్‌ పురస్కారం

ఏడాది కేన్స్‌ చిత్రోత్సవంలో ఓ భారతీయ లఘు చిత్రం సత్తా చాటింది. అచ్యుతానంద్‌ ద్వివేది అనే దర్శకుడు తెరకెక్కించిన ‘సీడ్‌ మదర్‌’ లఘు చిత్రం పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ చిత్రోత్సవంలో వర్ధమాన ప్రతిభను ప్రోత్సహించడానికి నిర్వహించే నెస్‌ప్రెస్సో టాలెంట్స్‌ విభాగంలో ‘సీడ్‌ మదర్‌’ తృతీయ బహుమతి గెలుచుకుంది. రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, సంవర్ధకమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తూ సీడ్‌ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రహీబాయ్‌ సోమ పొపెరే అనే మహిళా రైతు కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. గతేడాది బీబీసీ సంస్థ విడుదల చేసిన ‘100 వుమెన్‌ 2018’ జాబితాలో స్థానం సంపాదించుకున్న ముగ్గురు భారతీయ మహిళల్లో ఒకరిగా నిలిచారు రహీబాయ్‌.



రెండో రోజూ మెరుపులే...
కేన్స్‌ చిత్రోత్సవాల్లో బాలీవుడ్‌ తారల తొలి రోజు ఎంట్రీ ఆకట్టుకుంది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, కంగనా రనౌత్‌ చక్కగా సింగారించుకొని అలరించారు. రెండో రోజూ అంతకుమించిన సోయగాలతో మురిపించారు. నిమ్మపండు రంగు టుల్లే గౌనులో తలకు అందమైన హెయిర్‌ బ్యాండ్‌ ధరించి దీపికా పదుకొణె, పొడవాటి హాఫ్‌ షోల్డర్‌ గౌనులో కంగన మెరిపించారు. ఈ వేడుకల్లో జరిగిన ఛోపడ్‌ లవ్‌ ఈవెంట్‌లో లావెండర్‌ రంగు దుస్తుల్లో భర్త నిక్‌ జొనాస్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.