ఓ ఖైదీ కథ

పాఠకాదరణ పొందిన నవల ఆధారంగా రూపొంది విజయం సాధించడంతో పాటు ఆస్కార్‌ అవార్డును కూడా గెలుచుకున్న చిత్రం ‘కూల్‌హ్యాండ్‌ ల్యూక్‌’ (1967). ఓ ఖైదీ కథగా ఇది ఉంటుంది. అమెరికా రచయిత డాన్‌ పియర్స్‌ 1965లో రాసిన నవల ఆధారంగా వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ఈ సినిమాను అందించింది. ప్రముఖ దర్శకుడు స్టువార్ట్‌ రోసెన్‌బర్గ్‌ తీసిన ఈ సినిమాలో ఎన్నో అవార్డులు పొందిన నటుడు పాల్‌ న్యూమన్, జార్జి కెనడీ నటించారు. వీరిలో పాల్‌ న్యూమన్‌కి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్‌ లభించగా, జార్జి కెనడీకి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ లభించింది. అమెరికా ఆర్మీలో సైనికాధికారిగా ఉండే వ్యక్తి ఓ యుద్ధ ఖైదీగా మారడం, ఆ జైలులోని పరిస్థితులు, అక్కణ్ణుంచి తప్పించుకోవడం లాంటి వాస్తవిక సన్నివేశాలతో సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సుమారు 3.2 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 16.2 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అమెరికా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన ‘వంద మేటి సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.