ఓ దేశం పుట్టింది...
                               

మెరికా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే వర్ణవివక్ష నేపథ్యంలో తలెత్తిన సివిల్‌ వార్‌ను ప్రస్తావించక తప్పదు. నలుపు, తెలుపు రంగుల ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లి అమెరికాలో 1861 నుంచి ఘర్షణలు, పోరాటాలు, ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అశాంతికర పరిస్థితుల నుంచి అమెరికా ఒక శాంతియుత దేశంగా అవతరించడానికి కొన్నేళ్లు పట్టింది. ఆ దేశ చరిత్ర నేపథ్యంలో ఇద్దరు స్నేహితులు, రెండు కుటంబాల మధ్య కథతో అప్పటి సమాజం స్థితిగతులకు అద్దం పట్టిన సినిమా ్ఞద బర్త్‌ ఆఫ్‌ ఎ నేషన్ఠ్‌ ్బ1915్శ. ప్రముఖ దర్శకుడు డి. డబ్ల్యూ. గ్రిఫిత్‌ దీన్ని తెరకెక్కించాడు. గ్రిఫిత్‌ ఈ సినిమాను తెరకెక్కించడంలో ఉపయోగించిన వినూత్నమైన టెక్నిక్‌ కారణంగా దీన్ని సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిలాంటిదని చెబుతారు. థామస్‌ డిక్సన్‌ రాసిన ్ఞద క్లాన్స్‌మన్ఠ్, డిక్సన్‌ రాసిన ్ఞద లెపర్డ్స్‌ స్పాట్స్ఠ్‌ నవలల ఆధారంగా తీసిన ఈ చిత్రం విజయవంతమై, ఓ గొప్ప సినిమాగా పేరొందింది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌లో ప్రదర్శితమైన తొలి సినిమా కూడా ఇదే. దీన్ని అప్పటి అధ్యక్షుడు ఊడ్రో విల్సన్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అమెరికాలో తీసిన తొలి 12 రీళ్ల ్బనిడివి మూడు గంటల్శు సినిమా ఇది. ఈ సినిమాను 1946 కల్లా ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది చూశారని అంచనా.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.