దెయ్యాల ప్రేమాయణం


12 కోట్ల కాపీల అమ్మకం... 37 భాషల్లోకి అనువాదం... ఇంతకన్నా ఓ రచయితకి కావలసిందేముంటుంది? అదే సాధించింది స్టెఫీన్‌ మేయర్‌. ఈమె ‘ట్విలైట్‌’ పేరుతో రాసిన నాలుగు పుస్తాకాలు సంచలనం సృష్టించాయి. ఇంతకీ ఏముంటుందా పుస్తకాల్లో? దెయ్యాలు, పిశాచాల మధ్య ప్రేమలు, వ్యామోహాలు. ఆమె రాసిన ఆ నవలల ఆధారంగా తీసిన అయిదు సినిమాలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 3.3 బిలియన్‌ డాలర్లను వసూలు చేయడం విశేషం. ‘ట్విలైట్‌’ (2008), ‘న్యూమూన్‌’ (2009), ‘ఎక్లిప్స్‌’ (2010), ‘బ్రేకింగ్‌ డౌన్‌’ (2011), ‘బ్రేకింగ్‌ డౌన్‌2’ (2012) పేర్లతో వచ్చిన ఈ సినిమాలన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్‌ దృశ్యాలతో సినీ అభిమానులను అలరించాయి. వీటిలో ‘ఎక్లిప్స్‌’ సినిమా 2010 జూన్‌ 24న విడుదలైంది. ఐమాక్స్‌ ఫార్మట్‌లో విడుదలైన తొలి ట్విలైట్‌ సినిమాగా గుర్తింపు పొందిన దీన్ని 68 మిలియన్‌ డాలర్లతో తీస్తే 698 మిలియన్‌ డాలర్లు కురిపించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.