పూల దొంగ కథ!
                                 

ఎవరైనా వజ్రాలో, బంగారమో, డబ్బో దొంగతనం చేస్తారు. కానీ పూలను ఎవరైనా దొంగిలిస్తారా? అలాంటి ఓ పూల దొంగపై ఓ పుస్తకం రావడం వింత అయితే, ఆ పుస్తకం ఆధారంగా సినిమా తీయడం ఓ విచిత్రం. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బ్రిటిష్‌ అకాడమీ, బాఫ్తాలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించింది. పైగా హాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు నికొలాస్‌ కేజ్, మెరిల్‌ స్ట్రీప్, క్రిస్‌ కూపర్‌లాంటి వాళ్లు నటించిన ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైంది కూడా. ఆ సినిమా ్ఞఎడాప్టేషన్ఠ్‌ ్బ2002్శ. నిజానికి ఇది ఓ వాస్తవిక సంఘటన ఆధారంగా జరిగిన కథే. సుసాన్‌ ఓర్లియన్‌ అనే ఓ జర్నలిస్ట్‌ రాసిన ్ఞద ఆర్కిడ్‌ థీఫ్ఠ్‌ రాసిన పుస్తకం దీనికి ఆధారం. అరుదైన ఆర్కిడ్‌ జాతి పుష్పాలను అక్రమంగా î ేరే దేశాలకు రవాణా చేస్తున్నారనే ఆరోపణపై ఫ్లోరిడాలో 1994లో కొందర్ని అరెస్ట్‌ చేశారు. ్ఞఘోస్ట్‌ ఆర్కిడ్స్ఠ్‌ అనే విలుî ైన పుష్పజాతి మొక్కలకు నకిలీలను సృష్టిస్తున్నారనే ఈ సంఘటనపై ఆ జర్నలిస్ట్‌ పరిశోధన చేసి వార్తా కథనాలతో పాటు పుస్తకాన్ని వెలువరించింది. పుస్తకంలోని విషయాల ఆధారం చేసుకునియ కల్పిత కథనాన్ని అల్లుకుని ఓ థ్రిల్లర్‌ సినిమాగా దీన్ని తీశారు. ఇందులో నికొలాస్‌ కేజ్‌ కవల సోదరుల పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ పుస్తకం ఆధారంగా ఓ సినీ స్క్రీన్‌ప్లే రచయితను స్క్రిప్ట్‌ రాయమనడం, సరైన వివరాలు లేక అతడు రాయలేకపోతున్న తరుణంలో అతడి కవల సోదరుడు అతడి స్థానంలో రచయితగా రంగప్రî ేశం చేసి సినిమా కథ అల్లేయడం లాంటి సంఘటనలతో ఇది ఓ వ్యంగ్మాత్మక, ఉత్కంఠభరిత చిత్రంగా రూపొందింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.