‘ఎక్స్‌ట్రాక్షన్’ ట్రైలర్‌కి నైజీరియన్‌ కుర్రాళ్ల ప్రతిసృష్టి
ప్రముఖ హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌, బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడా కలిసి నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రాక్షన్‌’. సామ్‌ హార్‌గ్రేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏజీబీఓ, థిమాటిక్ ఎంటర్టైన్మెంట్, ఇండియా టేక్ వన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్‌ 24, 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని అనుసరించి మక్కికిమక్కీగా నైజీరియా దేశానికి చెందిన కుర్రాళ్లు క్రిస్‌ హ్యామ్స్ వర్త్‌, మిగతా నటీనటులుగా అలాంటి సీన్లనే తమదైన రీతిలో చిత్రీకరించారు. తాజాగా ఈ వీడియోని చూసిన క్రిస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ట్రైలర్‌ షాట్‌ని అప్‌లోడ్ చేసి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్బంగా క్రిస్‌ హ్యామ్స్ వర్త్ స్పందిస్తూ..‘‘మా నిజమైన ట్రైలర్‌ వెర్సన్‌ కన్నా మీరు తీసిన ట్రైలర్‌ వెర్షన్‌ బాగుందని అనుకుంటున్నాను అంటూ..’’ పేర్కొన్నాడు. ఈ చిత్ర కథేంటంటే ఓవీ మహాజన్ సీనియర్‌‌(పంకజ్‌ త్రిపాఠి) భారతదేశంలో నేర సామ్రాజ్యానికి అధిపతి. ఇతను జైల్లో ఉంటాడు. అతని కుమారుడు ఓవీ మహాజన్‌ జూనియర్‌ (రుద్రాక్ష జైశ్వాల్‌)కు శత్రువుల నుంచి ఆపద ఉండటంతో సాజు (రణ్‌దీప్‌ హుడా) సంరక్షణలో ఉంచుతాడు. ఒకరోజు పార్టీకి వెళ్లిన ఓవీ మహాజన్‌ జూనియర్‌ను బంగ్లాదేశ్‌లోని నేర సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆమిర్‌ ఆసిఫ్‌(ప్రియాంన్షు) కిడ్నాప్‌ చేస్తాడు. విషయం తెలిసిన ఓవీ మహాజన్‌ సీనియర్‌.. సాజును హెచ్చరించి, తన కుమారుడిని ఎలాగైన తీసుకురావాలని చెబుతాడు. దీంతో అతనితో పాటు డబ్బు కోసం ఎలాంటి సాహసమైనా చేసే ఒక బృందాన్ని కలిసి విషయం చెబుతాడు. ఆ పిల్లాడిని కాపాడేందుకు ఆ బృందం సాహసవంతుడైన టేలర్‌ రేక్‌(క్రిస్‌ హ్యామ్స్‌వర్త్‌)ను బంగ్లాదేశ్‌కు పంపుతుంది. మరి ఆమిర్‌ అపహరించిన ఓవీ మహాజన్‌ జూనియర్‌ను టేలర్‌ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటి? ఓవీని ప్రాణాలతో కాపాడాడ లేదా అనేది మిగతా కథ. ఈ చిత్రానికి ఆండీ పార్క్స్‌, జోయ్‌రుస్సో, ఆంథోని రుస్సో కథ,స్క్రీన్‌ప్లే అందించగా, హెన్రీ జాక్‌మెన్‌, అలెక్స్‌ బ్లేచర్‌ సంగీతం ఆకట్టుకుంది. ఇంకా చిత్రంలో ప్రియాంన్షు, రుద్రాక్ష జైశ్వాల్‌, గాల్‌స్విఫ్ట్‌ ఫర్హానీ, నేహా మహాజన్‌, పంకజ్‌ త్రిపాఠి తదితరులు నటించారు.

View this post on Instagram

A post shared by Chris Hemsworth (@chrishemsworth) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.