ఓ నటి జీవిత సినిమా!

సినీ నటీనటులపై అభిమానం ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉండిపోతుంది. అందుకనే సావిత్రి జీవితంపై తీసిన ‘మహానటి’ సినిమా అంతలా ఆకట్టుకుంది. ఇలా ఓ హాలీవుడ్‌ నటి జీవితంపై వచ్చిన సినిమా ‘ఫ్రాన్సెస్‌’, 1982లో విడుదలై విమర్శకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనా, రెండు ఆస్కార్‌ నామినేషన్లు పొందడం విశేషం. ఫ్రాన్సెస్‌ ఫార్మర్‌ అనే హాలీవుడ్‌ నటి జీవిత కథ ఇది. 1930ల్లో ఓ డజన్‌ సినిమాలతో మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఉన్నదున్నట్టు మాట్లాడడం, తాగుడు వ్యసనాల వల్ల మానసికంగా కుంగిపోయిన ఆమె జీవితంలో ఉత్థానపతనాలను విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించిందీ సినిమా. 8 మిలియన్‌ డాలర్లతో సినిమా తీస్తే కేవలం 5 మిలియన్‌ డాలర్లను మాత్రమే వసూలు చేసింది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.