సంగీతభరితం... రికార్డుల మయం
 
అందమైన అమ్మాయిలతో, చక్కని పాటలతో, ఓ మంచి ప్రేమకథను చూడాలనుకుంటే ‘జిజి’ (1958) చూడొచ్చు. కొలెట్టే అనే ఓ ఫ్రెంచి రచయిత్రి 1944లో రాసిన ఓ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా సినీ సంగీత ప్రియులకు విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేళ్లు... వంద మంచి సినిమాలు’ జాబితాలో చోటు సంపాదించుకోవడమే కాకుండా, మూడు మిలియన్ల పెట్టుబడికి 13 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. ఏకంగా 9 ఆస్కార్‌ అవార్డులను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. అయితే ఈ రికార్డు కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంది. తర్వాత ‘బెన్‌హర్‌’ సినిమా 11 అవార్డులు సాధించి ఈ రికార్డును తిరగరాసింది. ఇంకా ఆరు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు, మరో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.

                                     Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.