ఓ విలేకరి పరిశోధన!

విలక్షణ నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గ్రెగరీ పెక్‌ విలేకరిగా నటించిన సినిమా ‘జంటిల్‌మేన్స్‌ ఎగ్రిమెంట్‌’. లారా జెడ్‌.హబ్సన్‌ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా 1947 నవంబర్‌ 11న విడుదలై మూడు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. అమెరికా సమాజంలో జ్యూస్‌ పట్ల పాతుకుపోయిన వివక్షత ఎలా ఉందో తెలిసేలా పత్రికా కథనాలు రాసేందుకు ఓ విలేకరి తానే జ్యూగా గుర్తింపు మార్చుకుని పనిచేయడం కథాంశం. ఇతడికి జ్యూ అయినప్పటికీ నాన్‌-జ్యూ గుర్తింపుతో ఉద్యోగం పొందిన ఓ యువతి పరచయం అవుతుంది. ఇద్దరి ప్రేమ, సామాజిక వాస్తవాలు, పరిశోధన, మానవ సంబంధాల మధ్య జరిగే కథగా ఈ సినిమా 1947 నవంబర్‌ 11న విడుదలై విజయవంతమైంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.