గ్లాడియేటర్‌ సీక్వెల్‌కి పనిచేస్తున్న రిడ్లీ స్కాట్‌

2000లో వచ్చిన హాలీవుడ్‌ ప్రఖ్యాత చిత్రం ‘గ్లాడియేటర్’‌. అప్పట్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించడమే కాకుండా ఘనమైన వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు రిడ్లీ స్కాట్‌ సీక్వీల్‌ కోసం స్ర్కిప్టును తయారు చేసే పనిలో ఉన్నారట. అయితే చిత్ర నిర్మాతల్లో ఒకరైన డౌగ్లక్‌ విక్‌ మాట్లాడుతూ..‘‘అవును గ్లాడియేటర్‌ చిత్రం కోసం రిడ్లీ స్కాట్‌ పనిచేస్తున్నాడని చెప్పారు. ‘‘అయితే ఈ సీక్వెల్‌ సినిమా స్ర్కిప్టుని తయారు చేయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఇందులో హీరో మాగ్గిమస్ (రస్సెల్‌ క్రో) పాత్ర చివర్లో చనిపోతుంది. అయితే సీక్వెల్‌కి ఇదేమీ ఆటంకం కలిగించదని రిడ్లీ స్కాట్‌ చెప్పాడు. గ్లాడియేటర్‌ ఎన్నో భాషల్లో విడుదలై ఆకట్టుకుంది. 11 ఆస్కార్‌ నామినేషన్లు కూడా సంపాదించింది. ఈ ఈ సినిమాతో కథానాయకుడు రస్సెల్‌ క్రోవ్‌కి ఎనలేని ఆదరణ లభించింది. స్కాట్‌ ఫ్రీ ప్రొడక్షన్స్, రెడ్‌ వాగన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన చిత్రానికి జాన్‌ మెథిషియన్‌ కెమెరామెన్‌గా వ్యవహరించారు. ఇంకా ఇందులో జాక్విన్‌ ఫోనిక్స్, కొన్నీ నీల్సన్, ఆలివర్ రీడ్, డెరెక్ జాకోబీ, జిమోన్ హౌన్‌సౌ, రిచర్డ్ హారిస్ తదితరులు నటించారు.
  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.